ప్రస్తుత బిగ్ బాస్ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా ఉన్న సంగతి విధితమే. కానీ ఈ రోజు మా టీవీ రిలీజ్ చేసిన ప్రోమోలో టాలీవుడ్ అందాల రాణి రమ్యకృష్ణ కనబడింది. దానికి కారణాలు ఏంటా అని ఆరా తీస్తే కింగ్ నాగార్జున ప్లేస్ లో క్వీన్ వచ్చిందని తెలిసింది. “When King is Away Queen Arrived” అనే కాప్షన్ తో రమ్యకృష్ణ ఎంట్రీ ఉంది. ప్రస్తుతం నాగార్జున తన 60వ జన్మదిన వేడుకలు జరుపుకోడానికి స్పెయిన్ వెళ్ళారని తెలుస్తుంది.
కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుముందు ఎన్నడూ ఇలా బిగ్ బాస్ హోస్ట్ ఇలా మధ్యలో వెళ్ళిపోవడం జరగలేదు. ఇంక లోతుగా పరిశీలిస్తే కింగ్ నాగార్జున బిగ్ బాస్ షో ను నాని, జూ ఎన్టీఆర్ లాగా సమర్ధవంతంగా నడపలేకపోతున్నాడు అనే వాదన బయట బాగా వినపడడంతో నాగార్జున స్వయంగా షో నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ టీం బిగ్ బాస్3 కి మళ్ళీ ఒక కొత్త హోస్ట్ ను వెతుకుతున్న సమయంలో రమ్య వారికి కరెక్ట్ అనిపించడంతో ఆమె ఎంట్రీ జరిగిందని సమాచారం. కానీ ఇలా కింగ్ ప్లేస్ లో క్వీన్ రీప్లేస్ అవ్వడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.