పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉంటూ సినిమాల్లోకి కూడా రావాలా వద్దా అనే ఆలోచన తో ఉన్నారు. అయితే ఈ దశ లో ఆయన ప్రభుత్వం యురేనియం తవ్వకాలని ఆపేయాలని నేపథ్యం తో నల్లమల అడవులని కాపాడుకోవాలి అని పిలుపు ని ఇచ్చారు. ఈ పిలుపు ని చాలా మంది అందుకున్నారు. చాలా మంది పవన్ అభిమానులు, జనసేన పార్టీ ఫాలోవర్స్ అంతా ఈ పిలుపు ని అందుకుని నల్లమల అడవులని కాపాడాలి అని నిర్ణయించుకున్నారు.
కాకపోతే ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. పైగా తెలంగాణ ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. అందుకే వేరే ఏ హీరో కూడా అంత త్వరగా ముందుకు రావడం లేదు కానీ అదేంటో గానీ పవన్ తర్వాత అదే బాట లో విజయ్ దేవరకొండ నడుస్తున్నారు ఇప్పుడు. విజయ్ కూడా పవన్ కళ్యాణ్ లాగా నల్లమల ని కాపాడాలి అని ఒక నోట్ ని సోషల్ మీడియా లో పెట్టారు.
అయితే అందరికన్నా ముందు పవన్ తర్వాత విజయ్ రియాక్ట్ అవ్వడం తో మిగిలిన హీరోల కన్నా విజయ్ కి సమాజం మీద ప్రేమ ఉంది అని అంతా అంటుండటం విశేషం.