Saturday, May 4, 2024
- Advertisement -

‘గద్దలకొండ గణేష్’ టైటిల్ తో గోపీచంద్

- Advertisement -

గత కొంత కాలంగా ఒక మంచి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఇప్పుడు ‘చాణక్య’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మిల్కీ బ్యూటీ తమన్నా ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు దర్శకనిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారట. ఈ సినిమా ‘సిటీ మార్’ అనే ఒక మాస్ టైటిల్ తో విడుదల కాబోతోంది.

చాలా కాలం తర్వాత గోపీచంద్ ఇలాంటి ఒక ఫుల్ మాస్ సినిమా ని ఎంచుకున్నాడు. ఈ సినిమా కథ ప్రకారం ఈ టైటిల్ చాలా బాగా సెట్ అవుతుందని ఈ టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్ర పోషించిన వరుణ్ తేజ్ కథ లో ‘సిటీ మార్’ అనే సినిమా లో హీరోగా నటిస్తాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన ‘డిజె’ సినిమా లో కూడా ‘సిటీ మార్’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. మరి ఈ టైటిల్ గోపీచంద్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -