ఇప్పటి వరకు పవన్ సైరా ఎందుకు చూడలేదంటే ?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ’సైరా నరసింహా రెడ్డి’ ఇటీవలే రిలీజ్ అయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజే ఎవరు ఊహించని రెంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని పరిశ్రమల సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసిస్తున్నారు. ఈ సంచలన సక్సెస్ తర్వాత మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉంది. ఇక నిన్న రాత్రి ఓ పార్టీ కూడా చేసుకున్నారు. ఈ పార్టికి మెగా ఫ్యామిలీ తో పాటు ఇతర సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

అయితే ఈ సినిమా గురించి రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు మాట్లాడారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మాట్లాడకపోవడం అందరిలో చర్చనీయాంశం అయింది. అయితే పవన్ సినిమా చూడకపోవడానికి బలమైన కారణం ఉంది. కొంత కాలం నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన కేరళ ఆయుర్వేద పద్దతిలో చికిత్స తీసుకుంటున్నారట.

ఇద్దరు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుతున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తి అయ్యేసరికి కనీసం నెల రోజులు పట్టే ఛాన్స్ ఉందట. కాబట్టి పవన్ కు విశ్రాంతి అవసరం. ఈ కారణం చేతే అయన సైరా చిత్రం చూడలేదని అంటున్నారు. ఏది ఏమైన పవన్ కళ్యాణ్ వాయిస్ సైరాలో ఉండటం మెగా ఫ్యాన్స్ కి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.