Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లి.. అతని బర్త్ డే రోజు శుభవార్త..!

- Advertisement -

ప్రభాస్.. ఈ పేరు బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కేవలం ప్రభాస్ క్రేజ్ పై సాహో సినిమా దాదాపు పెట్టిన బడ్జెట్ రాబట్టింది. అయితే ఇవన్నీ ప్రభాస్ క్రేజ్ కు సంబంధించినవి. కానీ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చేసరి ప్రభాస్ ఎక్కడ కూడ నోరు విప్పడం లేదు. బాహుబలి సినిమా మొదలు కాకముందు పెళ్లి ప్రసవన వస్తే బాహుబలి చెసే క్రమంలో పెళ్లిని పక్కన పెట్టేశాడు. బాహుబలి సినిమా కంప్లీట్ చేయగానే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

బాహుబలి సినిమా రిలీజ్ అయింది కానీ పెళ్లి విషయం వచ్చేసరి సాహో సినిమా కంప్లీట్ చేసాక పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు. ఈ మధ్యలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణరాజు కూడా ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి కంప్లీట్ చేయగానే ప్రభాస్ పెళ్లి గురించి శుభవార్త ఉంటుందని చెప్పుకొచ్చాడు. చెప్పిన సినిమాలన్ని రిలీజ్ అవుతున్నాయి. కానీ ప్రభాస్ పెళ్లిపై మాత్రం ఎలాంటి వార్త బయటకు రావడం లేదు.

ఇక సోషల్ మీడియాలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారని, ప్రభాస్ భీమవరంకు చెందిన ఓ బిజినేస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఇలా రకరకల వార్తలు వచ్చాయి. వీటన్నిటిని ప్రభాస్ కొట్టిపడేశాడు. కానీ పెళ్లి గురించి మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. ఇప్పుడు ప్రభాస్ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాను అంటాడా ఏంటి అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రభాస్ కు ఈ ఆక్టోబర్ 23 వస్తే 40 ఏళ్లు వస్తాయి.

నలబై లో కూడా పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు ప్రభా అని సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రభాస్ పుట్టిన రోజు ఆక్టోబర్ 23న అతని పెళ్లికి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ రానుందని అంటున్నారు. మరి ప్రభాస్ పెళ్లి గురించి అతని బర్త్ డే రోజు తెలిస్తే పర్వాలేదు. లేకుంటే వచ్చే ఏదాది వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -