- Advertisement -

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పిన వితిక..!

- Advertisement -

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తుది దశకు చేరుకుంది. అయితే ఈ సీజన్ లో విజయం సాధించేది తన భర్తేనంటుంది వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు. రెండు వారాల క్రితం వరకూ భర్తతో హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వితిక.. ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత.. మీడియాతో ముచ్చటించిన ఆమె.. హౌస్ లో ఉన్న టైంలో తనకు ఓపిక విలువ తెలిసిందని తెలిపింది.

ఏ టాస్క్ లోనైనా తనకంటే వరుణే బాగా ఆడాడని చెప్పింది. హౌస్ లో వరుణ్ సోలోగా ఉంటే ఇంకా చాలా బాగా ఆడతాడని బయట చాలా మంది చెప్పారని.. అందుకే తాను ఎలిమినేట్ అయినందుకు బాధగా లేదని చెప్పింది. ఒకరి సహాయం లేకుండా.. గూగుల్ ను చూడకుండా సింపుల్ గా బతకవచ్చని తనకు హౌస్ లో ఉన్న టైంలో తెలిసిందని చెప్పింది. పలు టాస్క్ లను మైండ్ తో ఆడటంతో విజ్ఞానం పెరిగిందని చెప్పింది.

ఇక హౌస్ లో వంటలు చేయడంలో తానే బెస్టని.. ఆరు వారాల పాటు కిచెన్ కెఫ్టెన్ గా ఉన్నానని గుర్తు చేసిన వితిక.. ఫైనల్ లో వరుణ్ గెలిస్తే.. వచ్చే 50 లక్షలను భద్రంగా దాచుకుంటామని చెప్పింది. పెళ్లి తర్వాత మూడు ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు డబ్బులు వస్తే.. దాన్ని ఫిక్సెడ్ చేసుకుంటామని తెలిపింది.

ఇక ఫైనల్ లో తన భర్తతో పాటు శ్రీముఖి, రాహుల్ ఉండవచ్చని భావిస్తున్నానని వితిక అంచనా వేసింది. బిగ్ బాస్ 3 లో తాను హౌస్ లో ఉన్న సమయంలో మొత్తం 250 డ్రస్ లను మార్చానని.. రోజుకు మూడు డ్రస్ లను వేసుకున్నానని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -