దగ్గుబాటి రానా పరిచయం అవుతూ నటించిన సినిమా లీడర్. ఈ సినిమాతో రీచా గంగోపాధ్యాయ కూడా ఎంట్రీ ఇచ్చింది. లీడర్ తర్వాత ప్రభాస్ తో మిర్చి.. రవితేజతో మిరపకాయ్, సారొచ్చారు.. నాగార్జున తో భాయ్ వంటి తెలుగు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే తమిళంలో కూడా స్టార్స్ పక్కన నటించింది.
అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మ సడెన్‌గా పెళ్లికూతురిలా దర్శనమిచ్చింది. గత కొంత కాలంగా ఓ అమెరికా అబ్బాయ్ తో ప్రేమలో ఉందట. ఆయన పేరు జోకు అని తెలుస్తోంది.
ప్రేమ ముదిరి పెళ్లి వరకు వెళ్లిందట. అయితే, పెళ్లి వార్తను సీక్రెట్‌గా ఉంచింది ఈ భామ. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య రీచా వివాహం చాలా గోప్యంగా జరిగిపోయింది. నెట్టింట్లో రీచా పెళ్లి ఫోటోలు దర్శనమిస్తే కానీ, ఆమెకు పెళ్లయ్యిందన్న విషయం బయటపడలేదు.. ఇకపోతే భాయ్ సినిమా తర్వాత బ్రేక్ ఇచ్చిన రీచా.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి.
కానీ తనకు నటనపై పెద్ద గా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. స్టార్ హీరోల సినిమా అవకాశాలు వచ్చినప్పటికి చదువు పేరుతో విదేశాలకు వెళ్లి అక్కడ ఓ అబ్బాయి ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకుంది.