Sunday, May 4, 2025
- Advertisement -

ఇన్ సైడర్ ట్రేడింగ్ మోసంపై నోరువిప్పిన చంద్రబాబు

- Advertisement -

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ మంత్రుల ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. సోమవారం తూల్లూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నారు కదా కావాలంటే జ్యూడిషియల్ విచారణ చేసి నిరూపించాలని.. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని చంద్రబాబు సవాల్ చేశారు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చంద్రబాబు కప్పిపుచ్చారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందనే ఉద్దేశంతోనే అమరావతిని ఎంపిక చేశామని చంద్రబాబు తెలిపారు.

వరదలకు మునిగిపోయిందని అమరావతిని మంచిదికాదంటున్నారని.. కానీ భారీ నిర్మాణాలకు ఇది సరైందని నిపుణులు ఇచ్చిన నివేదిక తోనే అమరావతి నిర్మించామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్న వైసీపీ ప్రభుత్వం రాజధాని భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా అంటూ జగన్ కు సవాల్ చేశారు.

కమిటీలతో కాదు.. హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని చంద్రబాబు కోరారు. ప్రపంచంలోనే ఎక్కడా 3 రాజధానులు లేవని ఆయన గుర్తు చేశారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం లేదని.. 35 ఏళ్లుగా ఇది ఎస్సీ నియోజకవర్గమని చంద్రబాబు అన్నారు. పక్కనున్న మంగళగిరిలో బీసీలు ఎక్కువ అన్నారు. ఇక్కడ కమ్మ వాళ్లున్నారని.. భూములు కొట్టేశారన్నది అబద్దమంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -