అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో విపరితమైన క్రేజ్ సంపాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతని క్రేజ్ కు బాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. విజయ్ యాక్టిక్ కు, లుక్స్ కు బాలీవుడ్ హీరోయిన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తాను విజయ్ దేవరకొండ కు అభిమానని ఓ సందర్భంగా చెప్పింది.
ఇక ఇద్దరు కలిసి ఓ సెలబ్రిటీ ఫాషన్ ఈవెంట్ లో, అలాగే ఓ యాడ్ లో కలిసి సందడి చేశారు.ఇక ఈ మధ్యకాలంలో బీటౌన్ లో హీరోలతో కలిసి సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ అక్కడ కూడా పాగా వేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాను విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్ ని అని ఓ సందర్భంగా చెప్పింది. టాలీవుడ్ లో అవకాశం వస్తే అతనితో కలిసి చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి విజయ్ మీద తనకున్న లవ్ ని చాటింది ఈ భామ. విజయ్ మీద తనది వన్ సైడ్ క్రష్ అని చెప్పింది. ఈ విషయంను ఇదివరకే అతనికి చెప్పిన స్పదించలేదని సరదాగా చెప్పింది. అయితే విజయ్ నన్ను పట్టించుకోవడం లేదని.. నేనే అతని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్లు ఉందని మీడియాతో నవ్వుతూ అంది. ఇక విజయ్ యాక్టింగ్ బాగుంటుందని జాన్వీ చెప్పింది.
