అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద సినిమా నిలిచిపోయింది. ఈయన ప్రస్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది ఆయనకు 20వ సినిమా. వీరి కాంబోలో సినిమా వస్తుండుటంతో సినిమాపై అంచనాలు భారీగా పేరిగిపోయాయి. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే బన్నీ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికి సింపుల్ గా ఉంటాడు.
తన తోటి వారితో మర్యదగా.. ప్రెండ్లీగా ఉంటాడు. ముఖ్యంగా ఆయన తన పర్సనల్ స్టాఫ్‌ను చూసుకునే తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. పిఆర్ టీం కానీ.. వ్యక్తిగతంగా ఉండే స్టాప్‌ను కానీ బన్నీ చాలా బాగా చూసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇప్పుడు అదే మరోసారి నిరూపించాడు అల్లు అర్జున్. తన దగ్గర పని చేసే పర్సనల్ బాడీ గార్డ్ బర్త్ డే వేడుకలను ఘనంగా జరిపాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈయన పుట్టిన రోజు వేడుకల్లో బన్నీ పాల్గొన్నాడు.. దాంతో సుకుమార్ సినిమా లుక్ బయటికి వచ్చేసింది. ఈ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు బన్నీ. ముఖ్యంగా గడ్డం పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనగా ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ మాదిరి ఈ సినిమాలో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీలో రష్మీక హీరోయిన్ గా చేస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
