మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘జాగ్వార్’ …ఇంత బారి బడ్జెట్ కెవలం మోదటి సినిమా తోనే తెరకెక్కించడంతో ఈ సినిమా పై బారి అంచనాలే వున్నాయి మరి ఆ అంచనాలు ఈ సినిమా ఎంత వరకు నెలబెట్టుకుంధో చూద్దాం.
కధ :
మెడిసిన్ చదివే కుర్రాడుఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) పైకి సరదాగ నవ్వుతు అందరితో కలిసిపొయే అతను రాత్రి మాత్రం ఓ టీవీ ఛానల్నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్‌లో వచ్చేలా చేస్తూంటాడు. ఈ లైవ్ హత్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసును డీల్ చేయడానికి ఓ సీబీఐ ఆఫీసర్ (జగపతి బాబు)ను కూడా నియమిస్తుంది. ఇక నుంచి అసలు కధ మోదలవుతుంధి కృష్ణ ఇలా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ హత్యలన్నింటినీ లైవ్‌లో ఎందుకు ప్రదర్శిస్తూంటాడు? మరి (జగపతి బాబు) ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) పట్టుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.
విశ్లేషణ :
కధ విషయానికి వస్తే ఒక సాదా సిధ కధే అయిన దానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వుంటే అలాంటి చిత్రలు యే రేంజ్ లో విజయాలు పొందుతాయో మనం ప్రెత్యేకంగ చెప్పకర్లేదు..కాని ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు ఆ స్క్రీన్ ప్లే గ్రిపింగ్ గా మలచడంలో విఫలమయ్యాడనే చెప్పాలి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకు మహదేవ్ అల్లిన స్క్రీన్‌ప్లే సాదాసీదాగా వుండటంతో మంచి కమర్షియల్ కోవలో వుండాల్సిన సినిమా ఫ్లాట్ గ వెళ్ళిపోయింధి…నిఖిల్ కూమార్ కి ఇధి మోదటి సినిమా అయినా చాల బాగ చెసాడు ..ఈ సినిమాకి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింధి సినిమాటోగ్రఫీ..పెట్టిన ప్రతి రూపాయికి తగినా న్యాయం చేస్తు ..చాలా రిచ్ గా వుంధి ఎస్.ఎస్.థమన్ అందించిన పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో మేన్ హైలెట్ ఛేజింగ్ ఎపిసోడ్ ,ఇంటర్వెల్ ట్విస్ట్ ,క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రాణం పొసాయి ఇక నటినటుల విషయానికి వస్తే సీబీఐ ఆఫీసర్‌గా జగపతి బాబు బాగా చేసాడు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలిసింధి రావు రమేష్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో రమేష్ తన సహజమైన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.
మొత్తంగా:
జాగ్వార్.. తెలుగు కమర్షియల్ సినిమాల పరంపరలో ఎప్పుడూ వస్తూ పోతూండే వాటిల్లో ఒక సినిమా. అయితే ఈ సినిమాలో స్టార్ హీరో లేకపోవడమన్నదే ఇక్కడ పెద్ద మైనస్. అసలు కథలోని ఎమోషన్ బాగుండడం, కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు బాగా ఆకట్టుకోవడం లాంటి ప్లస్లతో వచ్చిన ఈ సినిమా మిగతా అన్నిచోట్లా రొటీన్ అయిపోవడం నిరాశపరిచే అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే.. రొటీన్ కమర్షియల్ అంశాలతో, జస్ట్ ఓకే అనిపించే స్పీడ్‌తో వచ్చిన ‘జాగ్వార్’ ఇది..!
రివ్యూ రేటింగ్: 2.75
{youtube}m5HSmGT9sXc{/youtube}
