Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఇంటి సభ్యులను భలే ఆటపట్టించ సుమ.. చివరికి భలే ట్విస్ట్ ఇచ్చింది!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ 4 సీజన్ మంచి ప్రజాదరణతో కొనసాగుతుంది.  ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఆదరణ తగ్గినప్పుడల్లా వైల్డ్‌కార్డు ఎంట్రీలను పంపి టీఆర్పీ రేటింగ్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఇలా ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇవ్వగా.. వారిలో కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్‌ తక్కువ రోజులకే బయటకు వచ్చారు. మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ అవినాష్‌ మాత్రం స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లో కొనసాగుతున్నాడు.  నాగార్జున, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమను హౌస్ లోకి పంపుతున్నట్టు చెప్పగా, సుమ సూట్ కేసుతో సహా స్టేజ్ పైకి వచ్చేసింది. ఆపై తనదైన శైలిలో నాగ్ పై, హౌస్ మేట్స్ పై పంచ్ లు విసిరింది.

కంటెస్టెంట్ల కోసం తాను తెచ్చిన బహుమతులను ఒక్కొక్కటిగా చూపిస్తూ సెటైర్లు వేసింది. మోనాల్ కు టిష్యూలను తెచ్చానని, లాస్య కోసం తెలుగు జోక్స్ పుస్తకమని, అరియానా కోసం లాలీపాప్ తెచ్చానని చెప్పింది. అవినాష్ కి అర్జున్ రెడ్డి డైలాగ్ ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరినీ ఒక్కో రకంగా ఆటపట్టించింది. రోజూ వ్యాయామం చేయలేదంటూ అభిజిత్ తో గంతులు వేయించి.. దేత్తడి హారికతో తెలుగుతో టంగ్ ట్విస్టర్లు చెప్పించేందుకు సుమ ట్రై చేసింది. 

అందరీకీ తాను హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పింది.. దాంతో ఇంటి సభ్యులు సుమకు వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. అంతలోనే తనకు ఎన్నో సినిమాల యాంకరింగ్స్ ఉన్నాయని నాలుగు మాటలు చెప్పేసి, తాను రావడంలేదంటూ స్టేజ్ పై నుంచి వెళ్లిపోయింది. తనకు గంగవ్వ వయసు వచ్చాక తప్పకుండా బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తానని ఫన్నీగా ఎండ్ కార్డు ఇచ్చింది.

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

అవినాష్ బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లాడో బయటపెట్టిన హైపర్ ఆది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -