తెలుగు కామెడీ కింగ్ బ్రహ్మానందంకు ఇటీవల ఆరోగ్యం బాలేదని సంగతి అందరికి తెలిసిందే. ఆయన ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాకపోతే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇవ్వడంతో ఆయన ముంబైలోనే ఉండిపోయారు. బుధవారం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. బ్రహ్మీ హైదరాబాద్ తిరిగి వచ్చారని కబురు తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్నారు.
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించాడు బన్ని. బ్రహ్మీ తిరిగి సినిమాలలో నటిస్తారని బన్ని ఆశాభావం వ్యక్తం చేశాడు. మునుపటిలా ఆయన సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని కోరుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు.
- Advertisement -
ఇంటికి వెళ్లి మరి బ్రహ్మానందాన్ని పరామర్శించిన బన్ని
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -