కెరీర్‌లో మొదటిసారిగా భరత్ అనే నేను చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా రాజకీయాలంటే ఆసక్తి లేని మహేష్ ఈ సినిమాలో సీఎంగా నటిస్తున్నారు. ప్రస్తుత రాజకీయీలకు తగ్గట్టుగా కోరటాల సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ, మహేష్ బాబు కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కైరాఅద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
కాగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ఆసక్తికరంగా సమాజానికి ఓ బాధ్యతాయుతమైన మెసేజ్ అందిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రంపై ధీమాగా ఉంది చిత్రయూనిట్. ఇక రిలీజ్‌కు రెండే రోజులు మిగిలి ఉండటంతో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. కాగా ఈ మూవీ చూసిన అనంతరం సెన్సార్ బోర్డువారు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా జీరో కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీచేయడం విశేషం. ఇక సెన్సార్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ‘భరత్ అనే నేను’ ద్వారా సొసైటీకి ఓ మంచి మెసేజ్‌ను ఇచ్చారని తెలుస్తోంది. ప్రతి పౌరుడికి సొసైటీ పట్ల భయం, బాధ్యత ఉండాలనేది కొరటాల మార్క్‌లో చక్కగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పాత్రకు మహేష్ వన్నెతెచ్చారని.. ఆయన హుందాతనం క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందని తెలుస్తోంది. అసెంబ్లీ సన్నివేశాలు, ఎన్నికలు ఎపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నాయని.. ‘భరత్ అనే నేను’ సమ్మర్ సీజన్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమే అంటూ సెన్సార్ సభ్యుల నుండి ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.