తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఓ హొటల్లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించింది. రకుల్ తాజాగా కార్తితో కలిసి దేవ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతు తనకు ఎదురైన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది. స్నేహితులతో కలిసి సరదాగా లండన్ వెళ్లిందట రకుల్. అక్కడ ఓ స్టార్ హోటల్ లో ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేసిందట. ఈ పార్టీకి రకుల్‌తో పాటు మరో పది మంది వెళ్లారట.
అక్కడ ఓ పూట లంచ్ చేశారు. లంచ్ తరువాత బిల్‌ను చూసి షాక్ అయిందట రకుల్. కేవలం లంచ్ చేసినందుకే రూ.10 లక్షలు బిల్‌ను వేశారట హోటల్ యాజమాన్యం. మరో ఆప్షన్ లేక ఆ మొత్తాన్ని చెల్లించి బయటపడినట్లు వెల్లడించింది. అదే మన ఇండియాలో అయితే కేవలం 50 నుంచి లక్ష మాత్రమే అయ్యేదని , కాని అక్కడ 10 లక్షలు బిల్‌ను వేశారని వాపోయింది. కాని మరో ఆప్షన్ లేక బిల్లును చెల్లించి , అక్కడ నుంచి సైలెంట్‌గా వచ్చేసిందట రకుల్. మళ్లీ జీవితంలో ఆ హోట్‌ల్‌కు వెళ్లనని చెప్పుకొచ్చింది.
- Advertisement -
హోటల్లో రకుల్‌కు చేదు అనుభవం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -