జక్కన్న రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి… మళ్లీ సత్తా చాటింది. విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించి.. ఏకంగా 600 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి.. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన సినిమాగా.. బాహుబలి ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇంత గొప్ప సినిమాను కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవించింది.
జాతీయ సినిమా అవార్డుల్లో.. బాహుబలికి ఉత్తమ సినిమా అవార్డు దక్కింది. గతంలో.. కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో.. జేవీ సోమయాజులు లీడ్ రోల్ లో వచ్చిన శంకరాభరణం సినిమాకు.. ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కింది. ఆ స్థాయిలో మళ్లీ ఇంత వరకూ మనకు జాతీయ అవార్డు రాలేదు.
ఈ సారి ఏకంగా… జాతీయ ఉత్తమ సినిమాగా బాహుబలి ఎంపికవడం.. చిత్ర యూనిట్ నూ, తెలుగు సినీ వర్గాలనే కాదు… సగటు తెలుగు సినీ ప్రేక్షకుడినీ గర్వంగా ఉప్పొంగిపోయేలా చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి కష్టానికి అసలైన గుర్తింపు దక్కేలా చేసింది.
ఇక.. పీకూ సినిమాలో చేసిన నటనకు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు ఉత్తమ నటుడిగా… తను వెడ్స్ మనూ రిటర్న్స్ లో నటనకు కంగనా రనౌత్ కు ఉత్తమ నటిగా.. బాజీరావ్ మస్తానీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి ఉత్తమ దర్శకుడిగా అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.