- Advertisement -
జనతా గ్యారేజ్‌కు నందులు వరుస కట్టాయి. 2016 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 8 నందులు జనతా గ్యారేజ్ చిత్రానికి దక్కాయి. ఉత్తమ కథా రచయితగా కొరటాల శివ, ఉత్తమ సహాయ నటుడిగా మలయాళ నటుడు మోహన్ లాల్, ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి (ప్రణామం.. ప్రణామం), ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ఏ.ఎస్ ప్రకాష్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం ఏడు నందులు జనతా గ్యారేజ్ కు దక్కాయి.
ఈ అవార్డుల పంటతో ఈ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. మంచి సందేశంతో తీసిన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, తమ శ్రమను గుర్తించి అవార్డులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.