టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. మహేశ్ బాబు సినిమా రిలీజ్ అవుతుంటే చాలు జనాలు క్యూ థియోటర్లకు క్యూ కడుతుంటారు. ఫ్యాన్స్‌కు నచ్చినట్లే సినిమాలు చేస్తున్నాడు మహేశ్ బాబు. సినిమాలు , ఫ్యామిలీ తప్ప మరేది పట్టించుకోడు మహేశ్. సినిమా షూటింగ్‌లో కాస్తా గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుంటాడు మహేశ్. న్యూ ఇయర్ వేడుకుల కోసం దుబాయ్ వెళ్లాడు మహేశ్.
అక్కడ ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సరాని స్వాగతం పలికాడు మహేశ్. న్యూ ఇయర్ వేడుకలలో కూతురు సితారతో కలిసి డ్యాన్స్ వేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. సితార తన తండ్రి మహేశ్ చేత రెండు డ్యాన్స్ స్టెప్‌లు వేయించింది. కూతురు అడిగితే ఏ తండ్రి కాదంటాడు చెప్పండి. కూతురు సితార అడగడంతో డ్యాన్స్ వేశాడు మహేశ్. ఇక మహేశ్ బాబు నటిస్తున్న మహర్షి సినిమా నుంచి కొత్త లుక్‌ను విడుదల చేయడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో మహేశ్ మూడు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నాడని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తోంది. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేయనున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ