నటి మాధవిలత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆమె బీజేపీ పార్టీలో చేరిన తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.తాను బీజేపీ పార్టీలో చేరడానికి గల కారణాలు వివరించారు.తనకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చే ఆ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తనకు జాతీయస్థాయిలో పని చేయలని ఉందని అందుకే తాను బీజేపిని ఎంచుకున్నాని తెలిపింది. తనను ఎక్కడ ప్రచారం చేయమన్నా చేస్తానని చెప్పింది. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని చెప్పింది.
పనిలో పనిగా ఏపి ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది.ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారని విమర్శించింది. బీజేపిలో చేరిన తాను పవన్‌కు పెద్ద అభిమానినే చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీ జరుగుతున్న అన్యాయాలపై పోరాడతానని తెలిపింది.తనకు ప్రాంతీయ భేదాలు లేవని రెండు రాష్ట్రాలను రెండు కళ్లుగా భావిస్తానని చెప్పింది.ఈ అమ్మడి మాటలు విన్న కొంతమంది రాజకీయ పార్టీలో చేరిన తరువాత మాటలు బాగానే పలుకుతుందని చర్చించుకుంటున్నారు.