ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీలోకి చేరికలు కొనసాగుతునే ఉన్నాయి. పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు , సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా వైసీపీలో పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది జగన్‌కు జై కొట్టారు. తాజాగా మరో నటుడు వైసీపీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే రాజశేఖర్ దంపతులు సోమవారం ఉదయం లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి పార్టీలో చేరారు.
వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిచారు. గతంలో రాజశేఖర్ దంపతులు వైసీపీలోనే ఉన్నారు. కాని పార్టీలో తమకు గుర్తింపు లేదని , జగన్ మొండిగా వ్యవహారిస్తాడని విమర్శలు చేసి మరి పార్టీని వీడారు ఈ దంపతులు.అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనాలతో వారు మళ్లీ వైఎస్ఆర్‌సీపీలో చేరినట్లు తెలుస్తోంది.
- Advertisement -
మళ్లీ వైసీపీలో చేరిన జీవిత రాజశేఖర్ దంపతులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -