తండ్రి కొడుకుల పాత్రలలో.. దేశంలో వెనుకబడ్డ సముద్ర తీర ప్రాంత ప్రజల కష్టాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో “ఎన్టీఆర్ 30” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా పై ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ” జనతా గ్యారేజ్ ” బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఏలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
NTR30 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే మొదటి రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకుంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటింస్తున్న విషయం తెలిసిందే. జాన్వి కపూర్ తల్లి పాత్రలో తొలి ప్రేమ, పిల్ల నచ్చింది, నిజం, పెళ్లాం వచ్చింది, దేవి నాగమ్మ, ఆచారి అమెరికా యాత్ర, నాంది సినిమాలతో అభిమానులను సంపాదించుకున్న మణి చందన కనిపించనుంది.
పాన్ ఇండియాగా వస్తున్న NTR30 సినిమాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.