- Advertisement -
అక్కినేని అఖిల్ ఇప్పటికి సక్సెస్ దక్కని హీరో. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటి ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది.
థియేటర్‌లో విడుదలైన రెండేళ్ల తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయింది. మార్చి 14, 2025న Sony LIV ఓటీటీలో వరల్డ్ వైడ్ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రం స్పై-థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది.
సాక్షి వైద్య కథానాయికగా నటించగా, ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అలాగే బాలీవుడ్ నటుడు డినో మోరియా , డెంజెల్ స్మిత్, సంపత్ రాజ్, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించారు. యాక్షన్ నేపథ్యంలో తెరరకెక్కిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.