కెరీర్ ఆరంభమే ఓ ఫ్లాపుతో రాగా తర్వాతి సినిమా సోసో ఆడినా అక్కినేని వారసుడు అఖిల్ మాత్రం తన మూడో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మూడో సినిమా అయినా బిగ్గెస్ట్ హిట్ నిలిచేది ఉండాలని భావిస్తూ దర్శకుల వేట ప్రారంభించాడు. దాదాపు మూడు నెలల నుంచి దర్శకులు, కథ రచయితల కోసం వెంపర్లాడుతున్నాడు. ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మపై దృష్టి పెట్టాడు. ఈపాటికే వర్మ శిష్యులను కలిశాడట.
అఖిల్ తన తరవాత సినిమాను దర్శకుడు రామ్ గోపాల్ దర్శకత్వంలో చేయాలని ఫిక్సయ్యాడట. అఖిల్‌తో తీయడానికి మంచి కథలు ఉంటే చెప్పాలని ఆర్జీవీ తన అసిస్టెంట్లను కోరినట్లు సమాచారం. వాళ్లలో ఒకరు చెప్పిన స్టోరీ అఖిల్‌కు నచ్చింది. అయితే ఈ సినిమా అసిస్టెంట్లు కాకుండా దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మనే తీయాలని పట్టుబట్టాడంట. వర్మ సినిమాలు వివాదాలతో పాటు హిట్లుగా నిలుస్తుండడంతో అఖిల్ ఆర్జీవీని ఫోర్స్ చేస్తున్నాడు. మొదట ఆలోచించిన వర్మ తర్వాత తానే చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వర్మ అక్కినేని నాగార్జునతో శివకు సీక్వెల్‌గా యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా విడుదల తర్వాత అఖిల్ సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇటీవల వర్మ మియా మాల్కొవాతో తీసిన ఓ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉండగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. చూద్దాం వర్మతోనైనా అఖిల్‌కు మంచి కెరీర్ లభిస్తుందని.