శ్రియా భూపాల్ ఆ మధ్య వార్తల్లో చక్కర్లు కొట్టిన పేరు ఇది.అన్ని సవ్యంగా జరిగితే అక్కినేని కోడలు కావల్సిన అమ్మాయి.జీవికే సంస్థ అధినేత కుతురు అయిన శ్రియా గతంలో హీరో అఖిల్‌ను ప్రేమించింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఎంగేజ్ మెంట్ కూడా అట్టహసంగా జరిగింది.ఏమైందో ఏమో కాని వీరి మధ్య అభిప్రాయభేదాలు కారణంగా వీరు విడిపోయారు.దీని తరువాత తన సినిమాలతో బిజి బిజిగా ఉన్నాడు. శ్రియా కూడా ప్రొఫిషనల్‌గా బిజి అయింది.అయితే గత కొంత కాలంగా అనిందిత్ రెడ్డి అనే వ్యక్తితో శ్రియా భూపాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.వాటిని నిజం చేస్తు వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
అనిందిత్ రెడ్డి ఎవరో కాదు…అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవడు, చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు అనిందిత్ రెడ్డి. అనిందిత్ తల్లి సంగీత, హీరో రాంచరణ్ భార్య ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెళ్లు. అనిందిత్ రెడ్డి ,శ్రియా భూపాల్ నిశ్చితార్థం నిన్న(సోమవారం) హైదరాబాద్‌లో జరిగింది.ఈ వేడుకకు ఉపాసనతో పాటు హీరో రాంచరణ్ కూడా హజరైయ్యారని తెలుస్తుంది.