సినీ రంగంలో పవన్ కళ్యాణ్, అలీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పవన్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే పవన్ ఎప్పుడైతే పాలిటిక్స్‌లో వచ్చారో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది.
ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అలీ పోటీ చేస్తారని ప్రచారం జరిగిన కానీ పోటీ చేయలేదు. అయితే వైసీపీ ఓటమి పాలు కావడంతో రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఓ షోకి హోస్ట్‌గా వచ్చిన అలీ…పవన్‌తో స్నేహంపై సంచలన కామెంట్స్ చేశారు. యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సుమ అడ్డ షోకు గెస్ట్‌గా వచ్చిన అలీ ఓ ప్రశ్నలో భాగంగా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆన్ స్క్రీన్ లో ఈ హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే ఇష్టం అని రవితేజ, పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పగా ఏ మాత్రం ఆలోచించకుండా పవన్ అనే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.