Tuesday, May 6, 2025
- Advertisement -

షాకింగ్ః నా పేరు సూర్య వెనకాల కుట్ర….. కనిపెట్టింది పవన్ కళ్యాణేనా?

- Advertisement -

నా పేరు సూర్య సినిమా వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతోందని ఆ సినిమా ఫంక్షన్‌లో అల్లు అరవింద్ చెప్పడం సంచలనం అయింది. ఆ కుట్ర విషయం బన్నీకి తెలియదని కూడా అల్లు అరవింద్ చెప్పాడు. ఇక రామ్ చరణ్ మాత్రం ఆ కుట్ర తనకూ తెలుసు అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. మరి నా పేరు సూర్య సినిమా వెనకాల కుట్ర ఏంటి? ఆ కుట్రను ఛేదించింది ఎవరు? ఎవరు కుట్ర చేస్తున్నారు? లాంటి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేసింది ఆద్య న్యూస్. ఈ ప్రయత్నంలో కొన్ని సంచలన విషయాలు అర్థమయ్యాయి.

తమ సినిమాలకు కలెక్షన్స్ వర్షం కురిపించుకోవడంలో, అభిమానుల్లో సెంటిమెంట్ రంగరించడంలో మెగా ఫ్యామిలీది అందె వేసిన చెయ్యి. అత్తారింటికి దారేది సినిమా సమయంలో కూడా ఆ సినిమా రిలీజ్‌కి ముందే నెట్‌లో దర్శనమివ్వడం వెనకాల చాలా పెద్ద కాన్‌స్పిరసీ ఉందని చెప్పాడు పవన్. ఆ కుట్ర వెనకాల ఉన్న మనుషులు ఎవరో కూడా తెలుసన్నాడు. ఆవేదనగా మాట్లాడాడు. ఆ కుట్రదారులు ఎవరో చెప్పమని అభిమానులు అడిగితే తర్వాత చెప్తానన్నాడు. కట్ చేస్తే ఇప్పటి వరకూ మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అయితే కేవలం డబ్బు కోసం కక్కుర్తి పడ్డ ఒక చిన్న స్థాయి ఎడిటింగ్ టెక్నీషియన్ చేసిన మోసమే అత్తారింటికి దారేది లీకేజ్ వెనక వ్యవహారమని అసలు విషయం తేలిపోయింది. కానీ కుట్ర అని పెద్ద పెద్ద మాటలు వాడిన పవన్…..అభిమానుల్లో సెంటిమెంట్‌ని రగిలించి అత్తారింటికి దారేది సినిమాకు కలెక్షన్స్ కొల్లగొట్టాడు.

ఇక ఇఫ్పుడు నా పేరు సూర్య సినిమా విషయంలో కూడా బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి. సినిమా అంతా సీరియస్‌గా ఉంటుందని…..ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే స్థాయి స్టఫ్ లేదన్న వార్తలు సెన్సార్ నుంచి, ఎడిటింగ్ యూనిట్ నుంచి వినిపిస్తున్నాయి. రివ్యూలు ఎలాగూ కాస్త నెగిటివ్‌గానే వచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టిన అల్లు అరవింద్ అత్తారింటికి దారేది విషయంలో పవన్ లాభపడినట్టుగానే బన్నీ కూడా లాభపడాలని కుట్ర కోణం అంటూ సెంటిమెంట్ డైలాగులు పేల్చాడు. ఇక ఆ తర్వాత నుంచీ మాత్రం కనీసం కుట్ర కోణం ఏంటి అన్న విషయం చెప్పినవాళ్ళు కూడా లేరు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్స్‌ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చాయి. సినిమా భారీగా రిలీజ్ కాబోతోంది. ఇక కుట్ర అంటే ఏముంటుంది? అంటే రివ్యూలన్నీ కూడా నెగిటివ్‌గా వస్తాయని భయపడి ముందుగానే రివ్యూ రైటర్స్‌ని బ్లాక్ మెయిల్ చేయడానికి కుట్ర కోణం అని పెద్ద పెద్ద పదాలు వాడేశారా? లేకపోతే అభిమానుల్లో సెంటిమెంట్స్ రగిల్చి సినిమా ఎలా ఉన్నా మొదటి మూడు రోజుల్లోనే భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టాలని ప్లాన్ చేశారా? అభిమానులే ప్రాణం, వాళ్ళే మా సర్వస్వం అని డైలాగులు కొడుతూ అదే అభిమానులను పిచ్చివాళ్ళను చేస్తూ కేవలం కలెక్షన్స్ కోసం ఇలాంటి డ్రామాలు ఆడడం ఎంత వరకూ కరెక్టో ఒక సారి ఆలోచించుకుంటే బెటరేమో స్టారాధిస్టారులు……..ఒక సారి అభిమానులకు ఈ గేమ్స్ అర్థమైతే మొదటికే మోసం రావడం ఖాయం…….జర జాగ్రత్త వెండితెర దేవుళ్ళు(?).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -