మెగా అభిమానులు చాలా జాగ్రత్రగా ఉండలని హెచ్చరించాడు మెగా నిర్మాత అల్లు అరవింద్.గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మెగా కుంటుంబంపై కుట్ర జరుగుతుందని …అందులోని భాగంగానే బన్నీ సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్లాప్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తునట్లు సంచలన ఆరోపణలు చేశారు.ఈ ప్రయత్నాన్ని అభిమానులు తిప్పికొడుతారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మనసుకు బాధ కలిగించే ఘటనలు కొన్ని జరిగాయని గుర్తు చేసిన ఆయన, ఆ విషయాలపై తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.
నిన్న జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గచ్చబౌలి స్టేడియంలో జరిగింది.ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా హీరో రాంచరణ్ వచ్చారు.అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా మే 4న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ చేస్తుంది. ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచియం అవుతున్నాడు.