పైసా సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది కేథరిన్. చూడచక్కని ఆమె సొంతం. కాని వరుస ఫ్లాప్‌లు రావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు.దీంతో సెకండ్ హీరోయిన్‌కు పడిపోయింది. నేనే రాజు నేనే మంత్రి, సరైనోడు,ఇద్దరమ్మాయిలు, గౌతమ్ నంద వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ భామను వరుస అవకాశాలు ఇచ్చి ఆదుకుంటున్నాడు హీరో అల్లు అర్జున్. కేథరిన్‌తో ఇప్పటికే రెండు సినిమాలలో నటించాడు బన్ని. సరైనోడు,ఇద్దరమ్మాయిలు సినిమాలలో బన్నితో కలిసి రొమాన్స్ చేసింది కేథరిన్. తాజాగా వీరిద్దరు ముచ్చటగా మూడోసారి కనిపించడానికి రెడీ అవుతున్నారు.
బన్ని ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన కొత్త సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా గీతా గోవింత బ్యూటీ రష్మిక నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాతో ఓ గ్లామర్ పాత్ర ఉందట. దీని కోసం ఎవరిని తీసుకుందాం అని ఆలోచన చేస్తున్న త్రివిక్రమ్‌కు కేథరిన్ పేరును సిఫార్స్ చేశాడట బన్ని. దీంతో బన్ని చెప్పినట్లుగానే సినిమాలో కేథరిన్‌ను తీసుకున్నాడట త్రివిక్రమ్. ఈ విషయం బయటికి తెలియడంతో బన్ని కేథరిన్ అంటే తెగ మోజులో ఉన్నాడనే కామెంట్స్ చేస్తున్నారట. మొత్తనికి వీరిద్దరు కలిసి మరోసారి తెర మీద కనిపించనున్నారు.
- Advertisement -
కేథరిన్ మోజులో పడ్డ అల్లు అర్జున్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -