టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతో విలువను ఇస్తుంటాడు. సినిమా షూటింగ్ లేకపోతే చాలు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు బన్ని. ఆయనకు ఓ కొడుకు , కూతురు అన్న సంగతి తెలిసిందే. తాజాగా కూతురు అర్హతో కలిసి సరదా తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు బన్ని. నాన్న మాటలను అర్హ తిరిగి చెబుతూ.. తండ్రిని ఆటపట్టించింది.నాన్నా.. నేను, నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని అర్జున్ చెప్పిన మాటలను అర్హ తిరిగి అనడం ఈ వీడియోలో కన్పిస్తుంది. అయితే అర్హ మాత్రం చేసుకోను.. అంటూ నవ్వుకుంటూ సమాధానం చెప్పింది.
దొంగ ఫెలో..చేసుకుంటానని చెప్పు అని అర్జున్ అంటూ కూతురితో సరదాగా ఆడుకోవడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వారి సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో నిర్మించనున్నారు. ఇక సినిమాలో హీరోయిన్‌గా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ, రష్మిక మందనా , వీరిద్దరిలో ఎవరో ఒకరు బన్నితో కనిపించడం ఖాయం అని అంటున్నారు.
- Advertisement -
వైరల్‌గా మారిన అల్లు అర్జున్ కూతురు వీడియో
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -