- Advertisement -
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్ ఫోటోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
అల్లు అర్జున్‌ని ఎప్పుడూ చూడని విధంగా దర్శకుడు వక్కంతం వంశీ ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఆర్మీ అధికారి ఎలా ఉంటారో తెలుసుకుని, వాళ్లని కలసి ఆ మేనరిజాన్ని అలవాటు చేసుకున్నారు బన్నీ.ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా సూపర్‌గా ఉంటుందని సమాచారం.మే 4న విడుదల కానుంది ఈ సినిమా.