నా పేరు సూర్య తరువాత అల్లు అర్జున్ ఇప్పటి వరకు మరో సినిమాను ఓకే చేయలేదు. లింగుసామి,విక్రమ్ కూమర్‌తో సినిమాలు చర్చల దశలోనే ఆగిపోయ్యాయి. దీంతో అల్లు అర్జున్ కొత్త సినిమాపై సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. అయితే అల్లు అర్జున్ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయనున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాకు దర్శకత్వం వహించాడు త్రివిక్రమ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా రాజమౌళితో వుంది.
ఇక చరణ్ .. బోయపాటి సినిమాతో బిజీగా వున్నాడు. రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్న ప్రభాస్ .. ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా లేదు. ఇక మహేశ్ కూడా తన 25వ సినిమా పనుల్లో తీరికలేకుండా వున్నాడు. ఇలా ఈ హీరోలంతా ఎవరి ప్రాజెక్టులను వాళ్లు చేసుకుపోతుండటంతో, అల్లు అర్జున్ పైనే త్రివిక్రమ్ దృష్టి ఉందనే టాక్ ఉంది. అటు అల్లు అర్జున్‌కు,ఇటు త్రివిక్రమ్‌కు ఒకరికరు తప్ప మరోకరు ఖాళీగా లేకపోవవడంతో , ఈ కాంబినేషన్‌లో సినిమా రావడం ఖాయంగా భావిస్తున్నారు.గతంలో వీరిద్దరు రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.