‘మహానటి’ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన ‘మహానటి’ టీమ్ ను అందరూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్‌కు అభినందలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మహానటి దర్శక నిర్మాతలు ఇంటికి పిలుపించుకొని మరి అభినందించారు.
ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరో కూడా చేరారు.మహానటి టీం కోసం అల్లు అర్జున్ ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.నిజానికి అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ సినిమాకు పోటీగా ‘మహానటి’ విడుదలైంది. బన్నీ సినిమా కాస్త డల్ గా సాగుతుంటే మహానటి మాత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. అయిన ఈ చిత్రబృందాన్ని అభినందించాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. ఈ పార్టీకి చిత్రయూనిట్‌తో పాటు పలువురు యువ దర్శకులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది.