ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ” . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం వచ్చిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దాంతో ” పుష్ప పార్ట్ 2 ” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ” పుష్ప ది రూల్ ” పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. దాంతో ముందుగా అనుకున్న కథను చాలా వరకు మార్పులు చేసి యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచనున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రెండ్రోజుల క్రితం పుష్ప ఎక్కాడా? అంటు ఓ సస్పెన్స్ వీడియోను సి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేసింది.
ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప ఎక్కడున్నాడో తెలిసే వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలోని ప్రతి సన్నివేశం పుష్ప హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా… తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఆచూకీ లేకపోవడంతో, పుష్ప ఎక్కడ అంటూ చర్చించుకోవడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. పుష్ప అసలున్నాడా? పోలీసులు అతడి శవాన్ని మాయం చేశారా? అనే సందేహాలు వెలువడతాయి. పుష్ప-2 ఎంత రసవత్తరంగా ఉండబోతోందో సుకుమార్ ఈ వీడియోతో దాదాపుగా హింట్ ఇచ్చేశాడు. చివర్లో చిరుతపులి పక్కనుంచి బన్నీ నడిచే సీన్ హైలైట్ గా నిలిచింది.
ఈ వేడి చల్లారక ముందే పుష్ప 2 టీమ్ నుంచి మరో క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. శరీరం అంతా నీలం కలరు.. చీరకట్టు, చేతికి గాజులు వేసుకున్న అల్లు అర్జున్ అమ్మవారి లుక్‌లో చేతిలో గన్ పట్టుకుని నిలుచున్న లుక్ లో కనిపించాడు. అసలు విషయం ఏంటంటే తిరుపతి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇక్కడ గంగమ్మ జాతర చాలా ఫేమస్. మగవాళ్లు ఆడవాళ్లలాగా వేషధారణలో అమ్మ వారికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ అమ్మవారి లుక్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది.
