మొత్తనికి అనుకున్నది సాధించాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని ఈ లోపు కొన్ని కథలు వింటూ కాలం గడిపేశాడు. నా పేరు సూర్య ఇచ్చిన షాక్ నుంచి బన్ని తెరుకోవాడానికి చాలా టైమే పట్టింది. దీంతో ఎలాగైన త్రివిక్రమ్‌తోనే సినిమా చేయలని భావించిన బన్ని, మొత్తనికి అనుకున్నది సాధించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా 19 కాగ, బన్ని- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ సినిమా మూడోది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. సంక్రాంతికి మొదలు కానున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా గీత గోవిందంతో ఫేమస్ అయిన రష్మిక మందానను తీసుకోనున్నారని తెలుస్తుంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’