లండన్ బ్యూటీ అమీ జాక్సన్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచియమైనప్పటికి అక్కడ ఈ అమ్మడికి తగిన గుర్తింపు రాలేదు.దీంతో సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.రామ్ చరణ్ ఎవడు సినిమాలో హీరోయిన్‌గా కనిపించి మురిపించింది.ఇక తమిళంలో అమీ జాక్సన్‌కు మంచి క్రేజ్ ఉంది.విక్రమ్-శంకర్ ఐ సినిమాలో హీరోయిన్‌గా చేసింది.అమీ.రజనీకాంత్ రోబో 2.0 సినిమాలో కూడా అమీనే హీరోయిన్.అదంతా అటుంచితే అమీ జాక్సన్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు.ఇన్ స్టాగ్రమ్ లో అమీ జాక్సన్ ఫోజులపై నిరంతరం ఆసక్తికర డిబేట్ సాగుతోంది.
బికినితో దర్శనం ఇచ్చి నాలో ఇంకా చాలా సెక్సీ అపీల్స్ ఉన్నాయంటు రాసుకొచ్చింది.చూసుకునేవాళ్లకు చూసుకున్నంత వినోదం పంచేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని అమీ జాక్సన్ వెల్లడించింది.అమీ బ్రిటన్‌కు చెందిన వ్యక్తితో డేటింగ్‌లో ఉందని వార్తలు వచ్చాయి.త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని బ్రిటన్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.దీనిపై అమీ జాక్సన్ స్పందించలేదు.