Tuesday, May 6, 2025
- Advertisement -

నా నడుము చూశావు అంటూ ఆదితో అనసూయ గొడవ..!

- Advertisement -

జబర్డస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజా జరిగిన ఎపిసోడ్ లో హైపర్ ఆదితో అనసూయ గొడవపడింది. విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ జోడీల్లో భారీ ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించింది అనసూయ- హైపర్ ఆది. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమెపై పంచులు మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు.

అందుకే అనసూయ- హైపర్ ఆది జంటను కూడా మరోలా ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్, భూమిక మధ్య పండిన రొమాన్స్ ఎపిసోడ్ చేసి వావ్ అనిపించారు ఈ ఇద్దరూ. ఖుషి సినిమాలో బాగా హైలైట్ అయిన నడుము సీన్ ను హైపర్ ఆది చేశాడు.

అందులో భాగంగా అనసూయ నడుముపై కన్నేసిన హైపర్ ఆది నానా రచ్చ చేశాడు. నా నడుము చూశావంటూ హైపర్ ఆదితో గొడవకు దిగింది అనసూయ. ఇదంతా చూస్తూ షోకు జడ్జిలుగా వ్యవహరించిన హీరో రాజ్‌తరుణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రోజా నవ్వు ఆపుకోలేక పోయారు. ఈ సన్నివేశంతో పాటు ఆది స్కిట్ అంతా పంచ్‌లు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -