తెలుగు యాంకర్స్‌లో అనసూయ ఒకరు. తన అందం , అభినయంతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది ఈ హాట్ యాంకర్. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి గ్లామరస్‌గా కనిపిస్తు అభిమానులను అలరిస్తోంది. ఈ హాట్ యాంకర్ అప్పుడప్పుడు సినిమాలలో కూడా తళ్లుక్కున మెరుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మాత్తగా నటించింది. ఈ సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. తాజాగా ఈ భామ ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భస్కర్‌ను హీరోగా పెట్టి ఓ సినిమాను తీస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్‌గా యాంకర్ అనసూయను ఎంపిక చేశారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుందని, తరుణ్ భాస్కర్ తో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన అనసూయ గ్లామర్ పాత్ర నిజమే కాని రొమాంటిక్ పాత్ర తనది కాదని చెప్పుకొచ్చింది. ఈ సినిమా తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతోందని ఆశభావం వ్యక్త చేసింది అనసూయ. ఆమె ప్రస్తుతం ‘కథనం’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ