శ్రీరెడ్డి…. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో బాగా నానిన పేరు. కొన్నాళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డి చూట్టునే తిరిగింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని, ఇక్కడ అవకాశాల కోసం పక్కలో పడుకోవాలని చెప్పి పెద్ద వివాదామే సృష్టించింది శ్రీరెడ్డి. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇండస్ట్రీకి చెందిన పలువురు నన్ను లైంగికంగా వాడుకున్నారని మీడియా సాక్షిగా బహిరంగంగానే చెప్పింది శ్రీరెడ్డి. అయితే ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి శ్రీరెడ్డికి మద్దతుగా ఎవరు మాట్లాడలేదు.
తాజాగా ప్రముఖ టీవీ యాంకర్, నటి అయిన ఝాన్సీ,శ్రీరెడ్డి విషయంపై స్పందించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతు శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతున్నప్పుడు నాలాంటి వాళ్లు సపోర్ట్ చేయకపోవడం, సైలెంట్ గా ఉండడం తప్పేనని అనుకుంటున్నాను. శ్రీరెడ్డి వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే, ఆమె లేవనెత్తిన ఇష్యూ మాత్రం చాలా పెద్దది. నటించడానికి వచ్చిన అమ్మాయిలను ఇలా లైంగికంగా వాడుకోవడం చాలా దారుణం అని చెప్పుకొచ్చింది ఝాన్సీ.శ్రీరెడ్డి విషయంలో నేను బయటికి వచ్చి మాట్లాడాల్సింది.
కాని ఆ సమయంలో నేను ఎందుకు బయటికి రాలేదో అర్థం కావడం లేదని తెలిపింది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆడవారికి కూడా ప్రత్యేకంగా ఓ సంఘం ఏర్పాటు చేశాం. నేను, నందిని రెడ్డి, సుప్రియ, మంచు లక్ష్మీ ఇలా అందరం కలిసి ఓ ప్యానెల్ గా ఏర్పడ్దాం. ఇక మీద శ్రీరెడ్డిలాగ అన్యాయం జరిగిన వారు మా దగ్గరికి వచ్చి వారి సమస్యలను చెప్పుకోవచ్చని ,ఇక మీద అలాంటివి జరగకుండా ఓ ప్లాట్ ఫాం ఏర్పాటు చేశామని” చెప్పుకొచ్చింది ఝాన్సీ.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’