సినిమాను పబ్లిసిటీ చేయలంటే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైన. సినిమా ఎలా ఉన్నప్పటి తన పబ్లిసిటీతో సినిమాపై హైప్ పెంచుతాడు రామ్ గోపాల్ వర్మ. వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశాడు వర్మ.
లక్ష్మి పార్వతిని పెళ్లి తరువాత ఎన్టీఆర్ ఎదుర్కొన్న పరిణామాలను ఈ పాటలో పొందుపరిచారు. రచయిత సిరాశ్రీ ఈ పాటను రచయించగా, కళ్యాణి మాలిక్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు. విల్సన్ హెరాల్డ్ తన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోశారు. మొదటి నుంచి తాను తీసేదే అసలైన ఎన్టీఆర్ జీవిత కథ అని చెబుతున్నాడు వర్మ. తన సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
మరో రచ్చ మొదలుపెట్టిన రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -