పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. పవన్ కెరీర్‌లో వస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగమయ్యారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.
ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తొలిసారిగా పవన్ – అనుపమ్ ఖేర్ ఇద్దరు కలిసి నటిస్తుండగా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.ఈ సినిమాలో తన పాత్ర జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని ఇస్తుందని చెబుతున్నారు అనుపమ్.
యువ దర్శకుడు జ్యోతి కృష్ణ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది.
లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి మరియు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి దిగ్గజాలు ఈ అద్భుత చిత్రం కోసం పని చేస్తున్నారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా త్వరలోనే మిగిలిన భాగం షూటింగ్ ప్రారంభం కానుంది.
రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్ త్వరలో విడుదల కానుంది.