బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాకు లాభాలు కూడా సూపర్బ్ గా వచ్చాయి.అయితే ఈమూవీ సెకండ్ పార్ట్ మ్యాటర్లో… లేనిపోని సమస్యలు వస్తున్నాయంటూ ట్రేడ్ లో చర్చ నడుస్తోంది.
మొదటి పార్ట్ విషయంలో సినిమా వర్కవుట్ అవుతుందో లేదో తెలియక టేబుల్ ప్రాఫిట్స్ లో మూవీని అమ్మేసుకున్నారు.దీంతో వస్తోన్న లాభాలన్నీ బయ్యర్లకు,డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లిపోయాయి. దీంతో శోభు యార్లగడ్డ సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి సోలోగా సినిమాను హ్యాండిల్ చేసి ప్రాఫిట్స్ మొత్తం గుంజేయాలని చూస్తున్నాడు.
మొదటి పార్ట్ కు సాయం చేసినవారిలో రామోజీరావ్ కు మళ్లీ శాటిలైట్ రైట్స్ అంటగట్టేసి తెలివిగా తప్పించుకుందామని చూస్తున్నాడు.ఇపుడేమో మిగిలిన పార్ట్ తీయడానికి కావల్సిన నిదుల కొరతతో మరొకరిని మనీ అడగలేక సతమతమౌతున్నాడు.వీలైనంత త్వరలో బాహుబలి ఇంగ్లీష్ ,చైనీస్ వెర్ష న్లను రెడీ చేయించి ఎలాగైనా వాటితో వచ్చే లాభాలతో
సినిమాను నిర్మించాలని త హతహలాడుతున్నాడు.ఎంతైన కమ్మని తెలివితేటలు కదా.అన్నట్లు ఇంకో విషయం …ఈసినిమాకు ముందుగా అనుకున్న 250కోట్ల బడ్జెట్ కాకుండా 350కోట్ల వరకు బడ్జెట్ ను పెంచేయనున్నారు.