జక్కన్న రూపొందించిన బాహుబలి సినిమా 500 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు వారాల్లో ఈ మార్క్ ఛేదిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలివుడ్ బ్లాక్ బస్టర్స్‌తో సమంగా ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుందని సమాచారం.
నార్త్, సౌత్ లలో కలెక్షన్ల సునామి సృష్టించిన బాహుబలి సినిమా తాకిడికి టాప్ హీరోలు కూడా భయపడుతున్నారు. తమిళనాడులో హీరో విజయ్ పులి సినిమా రిలీజ్‌కు ముందే ప్రెస్‌మీట్స్ పెట్టి బాహుబలి సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పోలిక ఉండదని ముందే చెబుతున్నాడు. పొరుగు రాష్ట్రాల హీరోలను కూడా అలా భయపెట్టేస్తుంది మన జక్కన్న సినిమా.
ఒక్క తెలుగు వెర్షన్‌లోనే మూడు వారాలకు ప్రపంచవ్యాప్రంగా 165 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని సమాచారం.
వరల్డ్ వైడ్ అన్ని భాషలలో మూడు వారాల షేర్ సుమారు 468 కోట్లు..
బాలివుడ్ – 42కోట్లు, కోలివుడ్ – 21 కోట్లు, మళయాలం 3.75 కోట్లు, ఇలా అన్ని ఇతర భాషల్లో మూడు వారాలకు గాను 231కోట్ల 87లక్షల గ్రాస్ కలెక్షన్స్.
కర్నాటక 30.50, ఓవర్సీస్ 27.5, రెస్ట్ ఆఫ్ ఇండియా సుమారు 10 కోట్లు , నైజాం 36.47 కోట్లు, సీడెడ్ 19.7, గుంటూరు 8.67, వైజాగ్ 8.55, ఈస్ట్ గోదావరి 8.05, వెస్ట్ గోదావరి 6. 53, కృష్ణా 6.08, నెల్లూరు 3.07 టోటల్ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ 97 కోట్ల12 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ 3 వారాల తెలుగు వెర్షన్ కలెక్షన్ షేర్స్ 165.12 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం.