Monday, May 5, 2025
- Advertisement -

అందాల ఆర‌బోత‌కు సైఅంటున్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి..మెగా హీరోస్‌తో నై

- Advertisement -

సొట్టబుగ్గలు.. నాజూకు నడుము.. ఆకట్టుకునే రూపం.. అలరించే అభినయంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిత్రంతోటే హిట్ కొట్టింది అందాల లావణ్యం ‘లావణ్య త్రిపాఠి. మోడల్‌గా రానిస్తూ.. మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌నూ గెల్చుకుంది ఈ కుందనపు బొమ్మ. అందాలరాక్షసి సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు ఎంటరై కుర్రకారు మదిలో గుబులు రేపింది.

అందాల‌రాక్ష‌సి త‌ర్వాత ఇండ‌స్ట్రీలో దూసుకుపోదామ‌నుకున్న లావ‌ణ్య‌కు కాలం క‌ల‌సి రాలేదు. ఆ తరువాత నానితో కలిసి ‘భలే భలే మగాడివోయ్’ అంటూ మరో హిట్ కొట్టి ఆ వెంటనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఇంతవరకూ లావణ్య త్రిపాఠి జర్నీ బాగానే సాగింది. ఇక ఆ తరువాత లావణ్యకు కష్టకాలం మొదలైంది. ఆమె కెరీరే ఇప్పుడు ప్రమాదంలో పడింది.

లచ్ఛిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధా, యుద్ధం శరణం గచ్ఛామి, ఉన్నది ఒకటే జిందగీ.. ఇలా లాంగ్ ఫ్లాప్ లిస్ట్‌ నుండి బయటపడలేక తాజాగా ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో తన ఫ్లాప్ ట్రాక్‌ను కంటిన్యూ చేసింది. మిగతా సినిమాల సంగతెలా ఉన్నా లావణ్య త్రిపాఠి… మెగా హీరోలను బాగా నమ్ముకుంది. అటు వరుణ్ తేజ్‌తో ‘మిస్టర్’ చిత్రంతో గట్టెక్కడానికి ప్రయత్నించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక రీసెంట్‌గా సాయిధరమ్ తేజ్ సరసన‘ఇంటిలిజెంట్’లో నటించడంతో ఈసారైన హిట్ దాహం తీరుతుందేమోనని భావించింది. అయితే ఆ సినిమా మిస్టర్ చిత్రాన్ని మించి మరీ నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో లావణ్య కోరిక తీరనేలేదు

మొద‌టిచిత్రం అందాలరాక్షసి’ చిత్రంలో చాలా పద్దతిగా కనిపించిన లావణ్య త్రిపాఠి ‘ఇంటిలిజెంట్’ చిత్రానికి వచ్చే సరికి గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఇదివరకే గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ అంటూ బోర్డ్ పెట్టేసిన త్రిపాఠి అందాలు ‘ఇంటిలిజెంట్’ సాక్షిగా తేలిపోయాయి. మెగా హీరోతో వీరలెవల్లో రొమాన్స్ పండించే ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో ‘అందాలరాక్షసి’ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -