- Advertisement -
అవును ఇంకా ఇండస్ట్రీ హిట్ పడలేదంటున్న హీరో నాని .2018 లో ఇంకా ఇండస్ట్రీ హిట్ రాలేదని ఆ కోరిక అనుష్క నటించిన భాగమతి తీరుస్తుందని నాని చేప్పుకోచ్చారు.భాగమతి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన నాని ఈ ఏడాది భాగమతి బోణీ కొడుతుందని జోస్యం చెబుతున్నాడు.
ఈ ఏడాది అజ్ఞాతవాసితో మంచి బోణీ పడుతుందని అంతా ఊహించారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. జైసింహా సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ కాదు. ఇక రంగులరాట్నం అట్టర్ ఫ్లాప్ అయిన విషయం కూడా తెలిసిందే.ఇంట్లో ఓ సూపర్ స్టార్ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇన్నాళ్లూ తనకు తెలియలేదని, ఇప్పుడు అనుష్క తన ఇంటిలో మనిషిగా మారిపోవడంతో.. తమ ఇంట్లో కూడా ఓ సూపర్ స్టార్ ఉన్న ఫీలింగ్ కలుగుతోందని అంటున్నాడు నాని.