బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా నటుడు రానా నిర్వహించే యారీ నెం 1 ప్రొగ్రామ్‌కు దర్శకుడు క్రిష్‌తో పాటు బాలయ్య కూడా హాజరైయ్యాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూగా ప్రేక్షకులతో పంచుకున్నాడు బాలయ్య. ముందుగా బాలయ్యను సార్ సార్ అంటూ పిలచసాగాడు.దీనికి బాలయ్య .”ముందు సర్ అనడం ఆపవయ్యా” అంటూ నవ్వేశాడు బాలయ్య.
తరువాత రానా మీ చిన్నవయసులోకెళ్దాం అనగా ”నేనిప్పటికీ చిన్నోడినే కదా.. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావ్..” అంటూ రానాకి సెటైర్ వేశాడు బాలయ్య. మిమల్ని బాగా ఇబ్బంది ఫాన్ కౌంటర్ ఒకటి చెప్పమని అడగ్గా..ఒకటైతే కష్టం అని బాలయ్య బదులిచ్చాడు.ఆ తరువాత బాలయ్య గురించి క్రిష్ ని అడుగుతూ.. ”బాలకృష్ణ గారు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు.. సోషియో ఫాంటసీ, రొమాంటిక్ డ్రామా” అని అడగగా దానికి క్రిష్ వెంటనే.. ‘రొమాంటిక్ డ్రామా’ అని సమాధానమిచ్చాడు. దానికి క్రిష్ వైపు బాలయ్య గుర్రుగా చూశారు. మొత్తనికి బాలయ్య తనదైన శైలిలో షోని అలరించాడని ప్రొమో ద్వారా అర్థం అవుతోంది. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ