మెగా బ్రదర్ నాగబాబు, హీరో నందమూరి బాలకృష్ణపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది.నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది.గతంలో బాలకృష్ణ నాకు పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని చెప్పడం జరిగింది.దీనికి కౌంటర్‌గానే నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పారని భావిస్తున్నారు.తాజాగా మరోసారి నాగబాబు బాలకృష్ణని ఓ కమెడియన్‌తో పోల్చిన నాగబాబు మరో వివాదానికి తెర లేపారు.దీంతో నందమూరి అభిమానులు నాగబాబుపై మండిపడుతున్నారు.దీనిలో భాగంగానే నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న అంతరిక్షం సినిమాను టార్గెట్ చేశారు బాలయ్య అభిమానులు.
‘అంతరిక్షం’ సినిమాను విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్లు ప్రకటించాయి. సోషల్ మీడియాలో కూడా నందమూరి అభిమానులు ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. మరి నాగబాబు ఏ ఉద్దేశంతో బాలయ్య పై ఫోకస్ చేశాడో తేలీదుగానీ ఇప్పుడు తన బాలయ్య ఫ్యాన్స్ అందరూ తన కుమారుడి సినిమాను టార్గెట్ చేసేలా పరిస్థితి మారిపోయింది. మరి దీనిపై నాగబాబు,వరుణ్ తేజ్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?