మెగా బ్రదర్ నాగబాబు లేని పోని వివాదాలను కొని తెచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలతో నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు. గత కొద్ది రోజులుగా నందమూరి బాలకృష్ణపై నాగబాబు కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, తరువాత బాలకృష్ణ ఎందుకు తెలియదు, తెలుసు అతను పెద్ద కమెడియన్ అంటూ బాలకృష్ణను కించపరుస్తు మాట్లాడాడు నాగబాబు.
ఇక బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తీసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌పై కూడా కామెంట్స్ చేశాడు నాగబాబు. నిజాలు చెప్పలేని బయోపిక్‌లు మాకొద్దయ్యా అంటూ ఓ కవిత రాసి తన తన ఫేస్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు నాగబాబు అంటే చాలు మండిపడుతున్నారు. తాజాగా చెన్నైలో నాగబాబుపై బాలయ్య అభిమానులన నిరసన వ్యక్తం చేశారు. నాగబాబు చెన్నైలోని ఓ కాలేజీ లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగబాబును చూడగానే బాలయ్య అభిమానులు రెచ్చిపోయారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలకు నాగబాబు అసహనం వ్యక్తం చేశారు.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!