తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్, నందమూరి కుటుంబాలు చాలా పెద్దవి. ఈ రెండు కుటుంబాలు సినిమాల పరంగా తీవ్ర పోటీ ఉంటుంది. నువ్వానేనా అనేంత స్థాయిలో థియేటర్‌లో పోరాటం కొనసాగుతుంది. ఇది కేవలం థియేటర్ వరకు మాత్రమేనని తెలుపుతూ ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు నిరూపిస్తున్నారు.
బాలకృష్ణ ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలివిడిగా ఉంటారు. అన్ని కుటుంబాలతో కలిసి స్నేహంగా ఉంటాడు. బాలకృష్ణ మెగా ఫ్యామిలీతో చాలా ఏళ్లుగా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఇక ఇటీవల మెగా మేనల్లుడు నటించిన ఇంటిలిజెంట్ సినిమా టీజర్‌ను బాలకృష్ణ స్వయంగా హాజరై విడుదల చేశారు.
సంక్రాంతికి సి.కల్యాణ్ నిర్మించిన జై సింహ సినిమాతో బాలయ్య నటించాడు. ఆ సినిమా నిర్మాతనే కల్యాణ్ బ్యానర్‌లో సాయిధరమ్ తేజ్ సినిమా వస్తోంది. ఆ బంధంతో బాలకృష్ణ హాజరై సినిమాకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్‌పై ప్రశంసలు కురిపించారు. సాయిధరమ్ తేజ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని బాలయ్య ఆకాంక్షించారు. అయితే వీవీ వినాయక్ దర్శకత్వంలో తాను మరో సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు తన కోరికను చెప్పారు.