ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు నిన్ననే(బుధవారం) విడుదలైంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ పోషించిన సంగతి అందరికి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నాయని తెలుస్తోంది.తొలిరోజు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల దాదాపు మూడు కోట్లకు పైగానే కలెక్ట్ చేసిందని ట్రెడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజున రూ.9 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఓవరాల్‌గా ఈ సినిమా మొదటి రోజున పదిహేను కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తొమ్మిది కోట్ల షేర్ ని రాబట్టిందని సినీ పండితులు తెలిపారు.
ఏరియాల వారిగా సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
నైజాం………………………………1.75 కోట్లు
గుంటూరు…………………………2.05 కోట్లు
నెల్లూరు……………………………0.55 కోట్లు
వైజాగ్……………………………….0.87 కోట్లు
కృష్ణ………………………………….0.72 కోట్లు
వెస్ట్……………………………………0.45 కోట్లు
ఈస్ట్……………………………………0.50 కోట్లు
సీడెడ్………………………………….2.11 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.9 కోట్ల రూపాయలనువసూలు చేసింది. సినిమా లాభాలలోకి రావలంటే ఇంకా చాలా కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి సంక్రాంతికి మరో రెండు పెద్ద సినిమాలు ఉండటంతో బాలయ్య
సినిమా ఎలా నెగ్గుకోస్తుందో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’