Monday, May 5, 2025
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన ట్విట్ చేసిన బండ్ల గ‌ణేష్ ట్విట్

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్‌,బండ్ల గ‌ణేష్ బంధం గురించి అంద‌రికి తెలిసిన‌చ విష‌య‌మే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బండ్ల గ‌ణేష్ వీర భ‌క్తుడు. ప‌వన్ గురించి మాట్లాడ‌మంటే రోజుంతా మాట్లాడుతునే ఉంటాడు బండ్ల గ‌ణేశ్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హారించాడు బండ్ల‌. తీన్‌మార్‌, గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాల‌ను నిర్మించాడు బండ్ల గ‌ణేష్‌. ప‌వ‌న్‌కు వీరాభిమాని అయిన బండ్ల ప‌వ‌న్ జ‌న‌సేన‌లో చేర‌కుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరి అంద‌రికి షాకిచ్చాడు. రాజ‌కీయాలు వేరు, అభిమానం వేర‌ని చెప్పుకొచ్చాడు బండ్ల గ‌ణేష్‌.

అయితే ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి ఓ ట్విట్ చేశాడు బండ్ల గ‌ణేష్‌. “నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు….నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్ గారిని ఏపీ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి….మీ బండ్ల గణేష్” అని పెట్టారు. బండ్ల గ‌ణేష్ ట్విట్‌తో అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు.

అభిమాని అంటే మీలా ఉండాలి అంటూ రీట్విట్‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాత్రం బండ్ల గ‌ణేష్‌పై ఫైర్ అవుతున్నారు. మీరు ఒక పార్టీలో ఉండి , మ‌రో పార్టీ వ్య‌క్ది సీఎం కావాల‌ని కోరుకోవ‌డం ఏమిట‌ని వారు బండ్ల గ‌ణేష్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనిపై బండ్ల ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -